Featured Posts Coolbthemes

18, జులై 2013, గురువారం

నీ కవితను చదవను నేను....
నీ కవితను చదవను నేను....

ఇష్టం లేక కాదు.... ఆలోచించలేక....
అర్థం కాక కాదు... ఆచరించలేక....
మనసు లేక కాదు... మరిచి పోలేక...
విషయం లేక కాదు... వ్యధను భరించలేక...

నీ కవితను చదవను నేను...

అందులో వేలాది విమర్శలు....
ప్రతి ఒక్కటీ నన్నే ప్రశ్నిస్తుంటాయ్...
సమాధానాలు ఎక్కడ వెతకను...
ఎంత వరకూ వెతకను....

నీ కవితను చదవను నేను...

అవి నన్ను నగ్నంగా నిలబెడతాయి...
సిగ్గుతో చచ్చిపోతున్నాను...
ఆచ్ఛాదన లేక అల్లాడి పోతున్నాను...
నిలువునా దహించుకుపోతున్నాను....

నీ కవితను చదవను నేను...

నా కళ్ళన్నీ అటే వెతుకుతున్నా....
నా మనసంతా అటే కదులుతున్నా...
నా ఆలోచనలు అటే మెదులుతున్నా...
నా భావాలు అక్కడే సంచరిస్తున్నా....

నీ కవితను చదవను నేను....

బహుదూరపు బాటసారికి... సతీష్ యశస్వికి.... సవినయంగా....నిర్భయంగా....

 నాలో నేను - నాతో నువ్వు


నాలో నేను ఆలోచిస్తూ కూర్చున్నా....
సరిగ్గా అప్పుడు కనిపించావు నీవు... లోపలెక్కడో
నీకోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా
నిన్ను నా దగ్గరే పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికా కదా....
నాతోనే ఉన్నావా...
నా వెంటే ఉన్నావా...
నీ పేరుతో నా ప్రేమను వెతికా....
కానీ నీ పేరు ప్రేమ కాదుగా....
అందుకే మళ్లీ ఆలోచిస్తూ కూర్చున్నా...
ఈ సారి కనిపించకే......

జ్ఞాపకాల ఆకులు...
కాలం చెట్టు కింద...
జ్ఞాపకాల ఆకులు రాలుతుంటే....

మనసు మొదళ్ళను కదిపే కొలదీ...
ఆకుల వర్షం హాయిగా మొదలైంది...

రాలే ప్రతి ఆకూ నా జ్ఞాపకం...
రాలే ప్రతి ఆకూ నా జీవితం...

ఒక్కొక్క జ్ఞాపకంగా కాలం కరిగి పోతుంటే....
ఒక్కొక్క అనుభవంగా జీవితం గడిచిపోతుంటే...

నాలో నువ్వుగా... నీలో నేనుగా...
మనతో కాలంగా... కాలం చెట్టు అనుభవలుగా...

రాలే ప్రతి జ్ఞాపకం రేపటి మన జీవితం...
చూసే ప్రతి జ్ఞాపకం నేటి మన జీవితం....

10, మే 2012, గురువారం

నేను.... నా దేవుడు

నేను, నా దేవుడు
ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం
నేను ఏదేదో వాగుతున్నాను.
వాడు వింటున్నాడో లేదో కూడా తెలియదు.
ఎంత పిలిచినా మాట్లాడడే...
వాడికి కాస్త ఇగో ఉందనుకుంటా...
అందుకే వాడి మాటలు వాడికే వినిపించా
భగవద్గీత బిగ్గరగా చదివా...

అప్పుడు తెలిసింది నాకు
వాడు మాట్లాడడని
ఎదురు చెప్పని వాడే దేవుడని
చెప్పే వాడు కాదు చేసే వాడే దేవుడని
అందుకే ఇప్పడిప్పుడే నేనూ దేవుడిగా మారుతున్నా
ఏదీ చెప్పడం లేదు. ఏదీ చెయ్యడం లేదు.

16, మార్చి 2012, శుక్రవారం

ప్రేమంటే ఇదేరా....వీడియోను చేర్చు

చాలా మంది చెప్పేవారు
ప్రేమిస్తే చాలా విషయాలు తెలుస్తాయని

నిజమే ప్రేమించే దాకా నాకు తెలియదు పిజ్జా రేటు

ప్రేమించే దాకా నాకు తెలియదు బాదే పోన్ బిల్లు

ప్రేమించే దాకా నాకు తెలియదు ఇంత బోరు

9, డిసెంబర్ 2008, మంగళవారం

శ్రీ గార్గేయ

సీతాకోక చిలుక నాకు ఇష్టమైన జీవి

ఎందుకంటే.......


మార్పు దానికి సహజ లక్షణం

ప్రతి క్షణం మార్పు దానిలో స్పష్టంగా

కనిపిస్తుంటుంది
స్వేఛ్ఛ దానికి

క్షణం స్వేఛ్ఛగా విహరిస్తుంటుంది

1, డిసెంబర్ 2008, సోమవారం

చిన్నతనం

నాకింకా గుర్తే నాన్న గుండెలపై ఆడుకోవడం ...
ఇప్పటికీ గుర్తున్నాయ్ అమ్మ చేతి గోరు ముద్దలు ...
సాయంత్రం ఆటలాడుతూ అడుగడుగునా ఆనందం ...
బడికి పోతూ బండలతో ఆడుకుంటూ శేను గాణ్ణి కొట్టడం ...
వాళ్లమ్మ నన్ను తిట్టడం ...
అన్నయ్య కొట్టడం ... అన్నీగుర్తే .............

30, నవంబర్ 2008, ఆదివారం

విశ్వాత్మ

చినుకుకు తపన నేలను
చేరాలనిపుడమికి తపన గుండెలు చీల్చి మొలకను
మొలిపించాలనిమొలకకు తపన పంటను అందించాలనిపంటకు
తపన రైతు కంట ఆనందం చూడాలని

నా గురించి

నా ఫోటో
నాకే సరిగా తెలియదని నా అభిప్రాయం, ప్రస్తుతం అనుకున్నంత కాక పోయినా మంచి కెరీర్లోనే ఉన్నాననుకుంటున్నాను.